యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'అభిలాష' నవల పాఠకుల హృదయాలను దోచుకుంది. ఈ నవలని ఆధారంగా చేసుకొని దర్శకుడు కోదండరామిరెడ్డి 'అభిలాష' సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి సినిమా పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న రోజులలో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ మైలు రాళ్ళలో ఒకటిగా నిలిచింది. లాయరుగా పెద్దగా ప్రాక్టీసులేని చిరంజీవి తమ రూమ్ మేట్ తో కలిసి ఓ గదిలో నివసిస్తూ ఉంటాడు. తన తండ్రికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడగని ఐపీసీ 302 ని భారతీయ శిక్షాస్మృతి నుండి తొలగించడానికి హీరో చేసే ప్రయత్నం ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాకు స్టోరీ ఆయుపట్టుగా నిలువగా.. ఇళయరాజా ఇచ్చిన సంగీతం సినిమా భారీ విజయం సాధించడానికి తోడ్పడింది. ఈ సినిమాలోని 'నవ్వింది మల్లె చెండు'.. 'సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది'.. 'యురేకా ఛాకా మీకా' లాంటి సాంగ్స్ ఇప్పటికీ ఆణిముత్యాలే. కాగా అభిలాష విడుదలై నేటికీ సరిగ్గా 37సంవత్సరాలు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa