మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. శ్రీనివాస్ బండారి దర్శకుడు. అనిల్ బొద్దిరెడ్డి నిర్మాత. షూటింగ్ పూర్తిచేశారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ ”ట్రైలర్ చూసిన అందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాుక అసలు ఏంజరిగిందంటే… టైటిల్ పెట్టడానికి కారణం… తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు వారి దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట వాడుతుంటారు. నేను కూడా సినిమా కతను చెప్పడానికి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. మనిషి జీవితంలో జరగబోయేది ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరుగెత్తడం తప్ప అంతకుమించి మనం ఏమీ చేయలేం అదే ఈ సినిమాలో చూపిస్తున్నాం అన్నారు. హీరో పాత్రకి సీనియర్ హీరో కావాలి. కానీ నాలాంటి కొత్తవాడితో జరిగే పనికాదు. అందుకే బాలనటునిగా అనుభవం ఉన్న మహేంద్రని హీరోగా తీసుకున్నాం. ఎలాంటి ద్వందర్థాలు లేని సినిమా ఇది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్, హీరో మహేంద్ర కూడా మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa