ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకుమార్ తో సినిమా కోసం స్టార్ హీరోలు క్యూ..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 12:48 PM

అల వైకుంఠపురములో సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా కి సిద్ధమవుతున్నారు. మొదట దర్శకుడు సుకుమార్ 2004 వ సంవత్సరంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య సినిమా తీసాడు. ఆ సినిమానే విజయం అందుకుంది. ఆ సినిమానే అల్లు అర్జున్ ని స్టార్ చేసింది. . రామ్ పోతినేని తో జగడం సినిమా అందించాడు. ఆ తర్వాత మూడవ సినిమా ఆర్య 2 తీసాడు. అలానే 100% లవ్ సినిమా యువతని బాగా ఆకట్టుకుంది. విజయం అందుకుంది ఆ చిత్రం కూడా. ఆ చిత్రం పాటలకి కూడా మంచి స్థానం దక్కింది.ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలు కూడా తీసాడు. అయితే కొన్ని సినిమాలు పెద్దగా కలిసి రాకపోయినా రంగస్థలం మాత్రం మంచి హిట్ ఇచ్చింది . సుకుమార్ ని దగ్గర వాళ్ళు సుక్కు అని సంభోదిస్తారు. సుకుమార్ కళాశాల రోజుల్లో ఉండేటప్పుడు బాగా పుస్తకాలని చదివేవాడట. అలానే చిన్న చిన్న కవితలు కూడా వ్రాసేవాడట.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం ఈ దర్శకుడికి మంచి పేరు తెచ్చింది. సుకుమార్ కెరీర్ లో ఈ చిత్రం ఉత్తమ విజయాన్ని అందించింది. అయితే తనకి గణితం పై పట్టు ఉండడం వల్ల కాకినాడ లో మంచి కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్నాడు. కానీ సినిమాల పై ఉన్న అభిలాష సినీ రంగంపై లాగుతూనే ఉంది ఈ దర్శకుడిని. రంగస్థలం వంటి హిట్ అందుకోవాలని ఏ హీరోకి మాత్రం ఉండదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa