కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వైరస్ విజృంభణ కారణంగా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలో వారు తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన బామ్మ (అల్లు రామలింగయ్య భార్య)తో కలిసి దిగిన ఫొటో బయటకు వచ్చింది. బామ్మతో ఆయన సరదాగా గడిపాడు. మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ ఫొటోను ఆయన భార్య స్నేహ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రియమైన వ్యక్తులతో క్వారంటైన్ లైఫ్ గడపడం మంచి అనుభూతి అని పేర్కొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa