కరోనా పై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి స్పందించారు. తాను సూపర్ మ్యాన్ గెటప్‌లో తీసుకున్న ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేసి తన కుమారుడు అభిషేక్ బర్త్‌డే పార్టీ సందర్భంగా ఈ డ్రెస్ వేసుకున్నానని.. ఇది సూపర్ మ్యాన్ థీమ్ డ్రెస్ అని అమితాబ్ పేర్కొన్నారు. తాను నిజ జీవితంలో కూడా సూపర్ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనాను నాశనం చేస్తానని తెలిపారు. రేపటి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ఆయన ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa