టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రేమలో ఉన్నట్లు ఓసారి, డేటింగ్‌లో ఉందంటూ మరోసారి, పెళ్లి కుదిరిందంటూ... ఇలా రూమర్స్ హల్‌చల్ చేశాయి. వాటిపై స్వీటీ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగలేదు. ఈ విషయాల గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటూ సొంత జీవితం ఉందని, అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు నచ్చడం లేదన్నారు.2008లో ఒక వ్యక్తిని ప్రేమించానని, కొన్ని కారణాల వలన ఆ ప్రేమ కొనసాగలేదని తెలిపింది. అందుకే మేము విడిపోయాం అని.. తాను ప్రేమించే వ్యక్తి ఎవరనేది చెప్పడం ఇష్టంలేదని తెలిపింది అనుష్క. అనుష్క తాజాగా ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa