హారర్.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ‘నిశ్శబ్దం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారి కాగా ఇతర ముఖ్య పాత్రల్లో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుష్క స్నేహితురాలు ‘సోనాలి’ పాత్రలో షాలినీ పాండే కనిపించనుంది. ఆమె పాత్ర అనుమానాస్పదంగా ఉంటుందనీ, ఆమె పాత్రనే కథలో కీలకంగా నిలుస్తుందట. షాలినీ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయట. షాలినీ పాండేకి వైవిధ్యభరితమైన రోల్ పడిందనీ నటన పరంగా ఇది తనని తాను నిరూపించుకునే పాత్ర అని టాక్. ఈ మూవీని హేమంత్ మధుకర్ రూపొందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa