తమిళ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది లేడీ దర్శకురాలు సుధ కొంగర. ఆమె వినిపించిన కథ అజిత్ కు నచ్చిందట. దాంతో సుధ కొంగరతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అజిత్. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలేం కాదు. మరి ఈ సినిమా కనుక హిట్ అయితే సుధ కొంగరకి డైరెక్షన్ చేయడానికి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ చిత్రం జూలై నుంచి పట్టాలెక్కుతుందని సమాచారం. సుధ కొంగర తమిళనాట డైరెక్టర్ గా దూసుకుపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa