ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆర్ ఆర్ ఆర్" నుండి అలియా బయటకు... చెక్ పెట్టిన అలియా..

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 11:42 AM

ఆర్ ఆర్ ఆర్   సినిమా  నుంచి  బాలీవుడ్ నటి   ఆలియాభట్   తప్పుకుందని  ఇటీవల వార్తలు వచ్చాయి. ఇతర సినిమాలతో డేట్లు క్లాష్ అవుతున్న కారణంగా `ఆర్ఆర్ఆర్` నుంచి  ఆలియా  తప్పుకుందనే టాక్ బయటకు వచ్చింది. ఈ వార్తలపై అటు చిత్రబృందంకాని, ఇటు  ఆలియా కాని స్పందించలేదు. అయితే  తాజాగా  చేసిన ఒక్క ట్వీట్‌తో ఆలియా ఆ  వార్తలన్నింటికీ చెక్ పెట్టింది. తను నటిస్తున్న `ఆర్ఆర్ఆర్` టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్నట్టు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆలియా ప్రకటించింది. `ఆర్ఆర్ఆర్` నుంచి తను తప్పుకున్నట్టు వస్తున్న వార్తలకు ఆలియా ఈ ట్వీట్‌తో చెక్ పెట్టినట్టైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa