ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాళాలను ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 01:24 PM

కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో ఇప్పుడు గుబులు రేగుతోంది. ఎక్కడో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యువుకు చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.దీంతో కరోనా బాధితులకు సాయం చేయడానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. నితిన్ తన వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. కమల్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించగా, ధనుష్ రూ. 15 లక్షలు, శంకర్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక పరిశ్రమలోని పేద కళాకారుల కొరకు వివి వినాయక్ ఐదు లక్షల విరాళాన్ని అందజేయగా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 50 లక్షలు, విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు అందజేశారు. కాగా గురువారం పవన్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ప్రకటించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రెండు తెలుగు రాష్ట్రాల క్షేమం కొరకు 20 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa