ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ సరసన మహానటి?

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 01:27 PM

'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. కానీ వంశీ చెప్పిన కథ మహేష్ కు నచ్చకపోవడంతో వీరి సినిమాకు మొదలవ్వకముందే బ్రేక్ పడింది. అయితే 'గీతాగోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ మహేష్ కు కథ వినిపించారు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్.తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరును సూచించాడట మహేష్ బాబు. దీంతో పరశురామ్ కీర్తి సురేష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. కరోనా వైరస్ కలకలం తగ్గిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa