మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారి కొత్త యేడాది ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కేవలం 24 గంటల్లోనే చిరంజీవిని 1 లక్ష 49 వేల మంది ఫాలో అవతున్నారు. ఈ సందర్భంగా ఆయన వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్ పై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. చిరంజీవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చిరంజీవి..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రామ్ చరణ్‌తో చేసిన వీడియో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa