రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని, ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకునే పవన్ కళ్యాణ్. కరోనా పై పోరాటానికి తన వంతుగా ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఇప్పటికే కరోనా పై పోరాటానికి పవన్ కళ్యాణ్ కంకణ బద్ధులయ్యారు. ఇప్పటికే ఈ పోరాటంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చెప్పున మొత్తంగా రూ. కోటి రూాపాయలను విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. పవన్ అనౌన్స్ చేసిన ఈ విరాళాలను ప్రభుత్వాలకు అందచేయడానికి ఏర్పాటు చేయవలసిందిగా పార్టీ ముఖ్య ప్రతినిధులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున స్వయంగా వెళ్లి అందచేయడం సాధ్యం కానందువల్ల బ్యాంకుల ద్వారా విరాళాలు అందించే ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పోరాటంలో గాయపడిన, అమరులైన సైనికుల కుటుంబాల కోసం గత నెల 20వ తేదీన ఢిల్లీ లోని సైనిక సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలను పవన్ కళ్యాణ్ గారు అందచేసిన సంగతి తెలిసిందే కదా.
