'బాహుబలి' తర్వాత జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.మోహన్ లాల్ కూడా ఆ పాత్ర చేయడానికి అంగీకరించారట. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని మరో ప్రత్యేక పాత్ర కోసం ఇప్పటికే అజయ్ దేవగణ్ ను తీసుకున్న విషయం విధితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa