ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' లో మహేష్ బాబు లేనట్టేనా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 06:04 PM

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు బ్లాక్ బాస్టర్ హిట్ అందించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మహేష్ బాబు కూడా నటిస్తున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ నటించడం లేదని తెలుస్తుంది. మహేష్ ప్లేస్ లో రవితేజను ఎంపిక చేశారట.. ఇక ప్రస్తుతం మహేష్ పరుశురాంతో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత మహేష్ సుకుమార్ తో సినిమాచేయనున్నాడు, ఆ తర్వాత త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడని టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa