పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. ఈ చిత్రంలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఓ కీలకపాత్ర చేస్తుందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రేణు దేశాయ్ స్పందించింది. వకీల్ సాబ్ సినిమాలో నేను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదు. ఎవరో పుట్టించిన ఆ రూమర్‌ను దయచేసి ఎవరూ నమ్మవద్దు. ప్రస్తుతం ఉన్న ఈ భయానక పరిస్థితుల్లో కూడా రూమర్లు క్రియేట్ చేసేంత టైమ్ వారికి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. దయచేసి ఇలాంటి రూమర్స్ పుట్టించవద్దు అని వివరణ ఇచ్చింది.పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa