మెగా హీరో వరుణ్ తేజ్ విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గద్దలకొండ గణేష్' సినిమా తర్వాత వరుణ్, దర్శకుడు కిరణ్ కొర్రపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే విదేశాలలో బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ సాయి మంజేకర్ ని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఇక రెండవ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే లావణ్య త్రిపాఠి పవన్ సినిమాలో కూడా నటిస్తుందంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa