చాలా కాలం తర్వాత మళ్ళీ మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఒక భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. దీనికోసం హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో మూడున్నర కోట్ల వ్యయంతో ఐటీ ఆఫీస్ సెట్ ను వేశారు. కరోనా నేపథ్యంలో షూటింగ్ లు వాయిదా పడడంతో.. 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈ సినిమాలో సునీల్ శెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa