ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి ని ఫాలో అవుతున్న రామ్ చరణ్ పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:49 PM

మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒకరి తర్వాత మరొకరు అదే రూట్లో వెళుతున్నారు. అది చూసి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే సినిమా చేస్తున్నాడు. అదేనండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో రామ్ చరణ్.. చారిత్రక యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఓ రేంజ్‌లో ఇరగదీసాడు. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. ఇపుడు రామ్ చరణ్ .. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను కొంచెం ఫిక్షన్ జోడించి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు.అటు చిరంజీవి, రామ్ చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా చారిత్రక యోధుడైన ‘పండగ సాయన్న’ పాత్ర అని చెబుతన్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ తన లైఫ్‌లో పూర్తి స్థాయిలో నటిస్తోన్న చారిత్రక సినిమా ఇదే. అంతకు ముందు మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ కూడా ‘రుద్రమదేవి’ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్రలో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కొక్కరుగా చారిత్రక పాత్రలు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa