ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ రకుల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:52 PM

రకుల్ ప్రీత్.. తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన అందాల నటి. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తూ అదరగొట్టింది. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లో నటించి మొదటి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు మరోసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ నటించే అవకాశం దక్కంచుకుందని తెలుస్తోంది. అజయ్ హీరోగా రూపొందే 'థ్యాంక్ గాడ్' చిత్రంలో ఆయనకు జోడీగా రకుల్ ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. దీంతో ప్రస్తుతం సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న రకుల్‌కు ఇదో గొప్ప అవకాశం. ఈ సినిమా తర్వాత మళ్లి పుంజుకుని హిందీలో పాగా వెయాలనీ ఆశిస్తున్నారు ఆమె అభిమానలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa