ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ట్రూలీడర్’ కు ‘శాల్యూట్’ అంటూ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 10:34 AM

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని, వాళ్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ, కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ‘ట్రూ లీడర్.. శాల్యూట్’ అంటూ సోనూ సూద్ ఓ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వీడియోను జతపరిచాడు. కాగా,  తెలంగాణలో పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలందరికీ  బియ్యం, గోధుమ పిండి పంపిణీతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు కూడా అందజేస్తామని నిన్న కేసీఆర్ ప్రకటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa