సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ తర్వాత ఇంత వరకు ఏ సినిమాను ప్రకటించలేదు. వంశీతో ఓ సినిమా అనుకున్న అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన సరైన కథ కోసం చూస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం తన తదుపరి దర్శకుడిని ఎంచుకొనే పనిలో ఉన్నాడు. సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరి దర్శకుల నుండి ఆయన కథలు వింటున్నాడు. అయితే కొంత కాలం మహేష్ గీతగోవిందం డైరెక్టర్ పరుశురామ్ తో సినిమాకు ఓకే అన్నట్లు వార్తలు వచ్చిన అది అధికారికంగా ప్రకటించలేదు. ఇపుడు తాజాగా మహేష్ కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. మహేష్ బాబు కూడా ప్యాన్ ఇండియన్ సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన ఇమేజ్‌కు సరిపోయే కథను ఇప్పుడు కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధం చేసినట్లు వార్తలు తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఉండనుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడట.ఇక తాజా సమాచారం మేరకు మహేష్ కి త్రివిక్రమ్ తో మూవీ చేయాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో టేకింగ్ తో త్రివిక్రమ్ అందరినీ పడగొట్టాడు. దీనితో ఆయతో మూవీ చేయాలనీ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుదిరితే త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. మహేష్ దానికి సిద్దంగా ఉన్న త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ 30వ చిత్రంకి కమిటై ఉన్నాడు. అందులో భాగంగా ఆయన వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఖాళీగా లేడు. కాబట్టి మహేష్ త్రివిక్రమ్ తో మూవీ చేయాలనుకున్నా అది వచ్చే ఏడాదే అవుతుంది. ఈ ఇద్దరీ కాంబీనేషన్‌లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టును సెట్ చేయడానికి మహేష్ బాబు వైపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa