ఈ తెలుగు అందం ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండేది కానీ.. చాలా సన్నబడి మెరుపుతీగలా మారి అదరగొడుతోంది. ప్రస్తుతం అంజలి'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. 'షాపింగ్‌మాల్' సినిమాతో పరిచయమైన అంజలి.. ఆ తర్వాత డైరెక్టర్ మురుగదాస్ నిర్మించిన 'జర్నీ'లో చక్కటి హావభావాలతో అంజలి అందరి మనసుల్నీ దోచుకుంది. ఆ సినిమాలో హీరో జైతో ఆడిపాడింది. ఎప్పుడైతే ఆ సినిమా బయటకు వచ్చిందో ఇక అప్పటినుండి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఓ రూమర్ తెగ హల్ చల్ చేసింది. చేస్తూనే ఉంది. అంతేకాదు ఈ జంట కొన్ని రోజులు ప్రేమించుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారనే వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి.ఈ విషయం గురించి అంజలి వద్ద ప్రస్తావించగా ఆమె మాట్లాడుతూ..నాది లవ్ ఫెయిల్యూర్ కాదు. అసలు నేను ప్రేమలో ఉంటే కదా లవ్ ఫేయిల్ అవ్వడానికి అని చెబుతూ... జై నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే! తనూ నేను ప్రేమలో ఉన్నట్టు కానీ, పెళ్ళి చేసుకోవాలని అనుకున్నట్టు కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. మా మధ్య ఏదో ఉందనీ, ఇప్పుడు విడిపోయామనీ వస్తోన్న వార్తల్లో నిజం లేదు.. ఇవన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవాలు కావని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. అయినా ఒక హీరోతో కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే.. ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టే.. అని ఎలా అనుకుంటారని తిరిగి ప్రశ్నించింది. ఫైనల్‌గా ఎవరేమనుకున్నా మా మధ్య స్నేహమే తప్ప ఇంకోటి లేదని తేల్చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa