అమృత అయ్యర్.. యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తోన్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవ్వనుంది. ఆ సినిమా విడుదల అవ్వక ముందే ఎనర్జిటిక్ రామ్ హీరోగా వస్తోన్న చేస్తున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తమిళ్ మూవీ ‘తడం’కు ఇది రీమేక్. అమృత అయ్యర్ తమిళ విజయ్ ‘బిగిల్’లో మహిళా పుట్ బాల్ జట్టులో సభ్యురాలిగా నటించింది. రెడ్‌ను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనుండగా స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎప్రిల్ 9న విడుదలకానుంది. అయితే తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూనే వున్నారు. తమ సత్తా చాటుకున్నవారు అగ్రస్థానానికి చేరుకుంటూనే వున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా 'అమృత అయ్యర్' కూడా చేరే అవకాశం ఉంది.ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే ఈ అమ్మడు వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే. ఏదో సరదాగా ఒకటి రెండు సినిమాలు చేసి వెళదామని అనుకున్నాను. కానీ 'బిగిల్' హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఒక సినిమా చేస్తుండగానే మరో రెండు ఆఫర్లు రావడం విశేషం. ఇది గ్లామర్ ఫీల్డ్ అనే విషయం నాకు తెలుసు. అయితే నా వరకూ నీను హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేస్తాను.. కానీ అంతకుమించి అందాలు ఆరబోయాలంటే మాత్రం నా వల్ల కాదని చెప్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa