కరోనా ప్రభావంతో షూటింగ్‌లు లేక నటీనటులందరూ ఇంట్లోనే ఉంటున్నారు. తమకి నచ్చిన పనులు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నటి సోనియా అగర్వాల్ లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు లభించిన సువర్ణావకాశంగా పేర్కొంది. ఇంకా ఆమె ఏమి చెప్పిందంటే.. 'రోజూ ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేస్తున్నాను. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం మనల్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇది ఒక మార్గం. పక్షులకు ఆహారం అందిస్తున్నాను. ఇక సినిమా కోసం స్ర్కీన్‌ప్లే సిద్ధం చేస్తున్నాను. స్ర్కిప్టు రాసేందుకు కావాల్సినంత సమయం దొరికింది ఇప్పుడు. కుటుంబంతో కలిసి గడిపేందుకు ఇదొక సువర్ణావకాశంగా భావిస్తున్నాను. అందరూ ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కరోనాని మన దేశం నుండి తరిమికొడదాం' అని సోనియా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa