ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెబ్‌సిరీస్‌ లో విశ్వక్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 01:00 AM

సినిమా రంగానికి ధీటుగా డిజిటల్ రంగం డెవలప్ అవుతోంది. భారీ రెమ్యునరేషన్స్‌తో పాటు ప్రేక్షకులకు రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పలువురు సినీ తారలు కూడా డిజిటల్ మాధ్యమాల్లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇలా డిజిటల్ మాధ్యమాల్లో నటించే హీరోల లిస్టులో విశ్వక్‌సేన్ చేరబోతున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతనే చెప్పుకొచ్చాడు. తరుణ్‌భాస్కర్ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతున్నాడట. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఈ నగరానికి ఏమైంది..? పేరుతోనే వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అందులోనే విశ్వక్ నటించబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa