పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్స్ సంచలన విషయాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 754 విమానాలకు నిర్వహించిన సాంకేతిక తనిఖీల్లో 377 విమానాల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపింది. దాదాపు 50% విమానాల్లో సమస్యలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ లోపాలను తక్షణమే సరిచేయాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సూచించింది. విమానయాన సంస్థలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa