రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, చరణ్ కి జోడీగా అలియా భట్ కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఈ సినిమా కోసం ఆమె అందుకోనున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను ఆమె 5 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న కథానాయిక అలియానే అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa