ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకు సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి.. దూసుకెళ్లిపోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 07:32 PM

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఈ క్రమంలోనే జాతీయ రహదారి 516ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అరకు ప్రాంతంలో ఈ రహదారి పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. హుకుంపేట నుంచి కొత్తభల్లుగూడ వరకూ నేషనల్ హైవే పనులు 98 శాతం పూర్తయ్యాయి. దీంతో వాహనాలు ఈ మార్గంలో రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. మరోవైపు అరకు సమీపంలోని రైల్వేట్రాక్ మీదుగా నిర్మించిన ఫ్లైఓవర్ కూడా వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ మీద వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. అలాగే అరకులోయ సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద కొన్ని చిన్న చిన్న పనులను పూర్తిచేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.


మరోవైపు జాతీయ రహదారి 516ఈ పనులను రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాడేరు- అరకు మధ్య మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాలలో వంతెనలకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులను ప్రపంచ బ్యాంకు అందిస్తున్న నిధుల సాయంతో చేపడుతున్నారు. జాతీయ రహదారి 516ఈ పనులు పూర్తి అయితే ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతానికి అనుసంధానతను మెరుగుపడుతుంది. అలాగే పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుంది.


అరకు, బొర్రా వంటి పర్యాటక ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కలగటంతో పాటుగా.. ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు.విశాఖపట్నం, విజయనగరం, అరకు, బొర్రా వంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణతో పాటుగా ఎయిర్‌పోర్టుల ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అలాగే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి నిధులు సమకూరుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa