ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశచూపి 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల గాజుల వ్యాపారి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశాడు. జనవరి 7 నుంచి 11 వరకు బాలికను నిర్బంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పితో ఏడవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa