కరుణ కుమార్ దర్శకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమా కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. యదార్థ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జత చేసి తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు కొత్తవారు నటించారు. కాగా తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మరింతమంది ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్స్ లో మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు అమెజాన్ లో ఈ సినిమాను వీక్షించి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పలాస సినిమా గురించి తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa