ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్ బాబు , పరశురామ్ సినిమాలో విలన్ పాత్రా లో ఉపేంద్ర?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 04:46 PM

‘గీత గోవిందం’ భారీ హిట్‌ అయిన విషయం తెలిసిందే.  ఈ చిత్ర  దర్శకుడు పరశురాం సారథ్యంలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం మేరకు పరశురామ్‌ పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట. దాంతో సోనూ సూద్ - ఉపేంద్రల పేర్లను పరిశీలించారు.యూనిట్ సభ్యుల్లో ఎక్కువ మంది, ఈ సినిమాలోని ప్రతినాయక పాత్రకి ఉపేంద్ర అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. పరశురామ్ ఈ విషయాన్ని మహేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కూడా ఉపేంద్రని తీసుకోవడమే కరెక్ట్ అని అన్నాడట. దాంతో ఉపేంద్రతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి'తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఉపేంద్ర, ఈ పాత్రతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa