ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్'లో నటిస్తున్న రజనీకాంత్ తదుపరి సినిమాకు సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. దర్శకులుగా కార్తిక్ సుబ్బరాజ్, రంజిత్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ అవకాశాన్ని శివ సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సినిమాలో రజనీ .. కమల్ తో కలిసి నటించనున్నట్టుగా కోలీవుడ్లో వార్తలు షికారు చేస్తున్నాయి.ఇద్దరం మాట్లాడుకునే కలిసి నటించడం మానేశామని గతంలోనే కమల్ హాసన్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఈ వార్తలు షికారు చేస్తుండటంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే రజనీ .. కమల్ కలిసి నటించడం లేదు. రజనీ సినిమాకి కమల్ నిర్మాతగా వ్యవహరంచనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa