ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్‌ ఎన్టీఆర్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ .. ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 05:43 PM

క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌కు ప్రమోషన్లను ప్రారంభించేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఉగాది రోజున మూవీ టైటిల్, మోషన్‌ పోస్టర్‌.. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. త్వరలో మరో వీడియోను రిలీజ్ చేయబోతోంది. వచ్చే నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించేసినట్లు ఫిలింనగర్‌లో టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ కోసం స్పెషల్ ప్రమోషన్లను చేయనుందట చిత్ర యూనిట్.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 75 శాతం కంప్లీటైంది. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ పెట్టారు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఒకసారి వాయిదా వేసి జనవరి 8కు పోస్ట్ పోన్ చేసారు. ఐతే రీసెంట్‌గా ఈ సినిమాను మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.   ఈ చిత్రాన్ని బాహుబలి 2 సినిమాను రిలీజ్ చేసిన డేట్ ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఐతే.. రాజమౌళి మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను ఇప్పటికే ప్రకటించిన జనవరి 8న విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇంట్లో ఉంటూ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగం పెంచాడట. అందులో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్’ ఇంటి నుంచే డబ్బింగ్ మొదలు పెట్టమని చెప్పారట.సాధారణంగా డబ్బింగ్ చెప్పడానికి సౌండ్ ప్రూఫ్ రూమ్‌లు, క్వాలిటీ ఉన్న సౌండ్ రికార్డింగ్ మైక్ కావాలి. ఇందు కోసం జక్కన్న.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు రెండు క్వాలిటీ మైక్‌లు పంపినట్టు సమాచారం. వీళ్లిద్దరు వాళ్ల ఇంట్లో ఉండే సౌండ్ ఫ్రూవ్ గోడలు ఉండే మినీ థియేటర్‌లో డబ్బింగ్ చెబుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఎంతో నిజం ఉందో తెలియాలి. ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ మాత్రమే డబ్బింగ్ చెబితే సరిపోదు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆయా భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ ముందు పూర్తి చేయాలి. ఆ తర్వాత కానీ డబ్బింగ్ చేయాలి.  ఒక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ చెబితే సరిపోదుగా.. మిగతా భాషల్లో కూడా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా మొదలుకావాలి కదా. ఏమైనా ఇంట్లోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి. మరి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa