ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ మూవీలో ఆ సీన్ హైలెట్ అట !

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2020, 12:46 PM

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది  '18 పేజెస్' ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం...ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఒకటి '18 పేజెస్' అయితే, మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కంటెంట్ తోనే రూపొందుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్ .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న '18 పేజెస్' కంటెంట్ చాలా వైవిధ్యభరితంగా వుంటుందట.కథ సెకండాఫ్ కి చేరుకునేటప్పటికి హీరోను కొన్ని కీలకమైన పరిస్థితులు చుట్టుముడతాయట. అలాంటి పరిస్థితుల్లోనే అతను మెమరీ లాస్ అవుతాడు. మెమరీ లాస్ అనేదే ఈ కథలో కీలకమైన పాయింట్ అట. మెమరీ లాస్ తో అతను ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాడు? ఎలా విలన్ బృందం ఆటకట్టించాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa