ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది పవన్ కెరీర్ లో సో స్పెషల్..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 10:40 AM

తమిళంలో వచ్చిన లవ్ టు డే చిత్రాన్ని తెలుగులో సుస్వాగతంగా తెరకెక్కించారు. 1998 జనవరి 1న విడుదలైన సుస్వాగతం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం విజయం పవన్ కి హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ కి బాలకృష్ణ అతిథిగా రావడం విశేషం. ఇక అదే ఏడాది దర్శకుడు కరుణాకర్ తెరకెక్కించిన తొలిప్రేమ మూవీ ఓ ప్రభంజనం. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆ సెన్సిబుల్ లవ్ ఎంటర్టైనర్ పవన్ కి యూత్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆరువాత పవన్ తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని పవర్ స్టార్ అయ్యారు.  పవన్ కళ్యాణ్ కి 1998 సో స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ని హీరోగా నిలబెట్టిన రెండు బ్లాక్ బస్టర్స్ ఆ ఏడాది ఆయన నుండి వచ్చాయి. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తదుపరి ఏడాది గోకులంలో సీత మూవీలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి. పవన్ కి హీరోగా ఓ ఇమేజ్ ఐతే రాలేదు. దీనితో ఆయన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ తమిళ్ రీమేక్ కి కమిట్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa