ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్ల క్రెడిట్ ను కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు : అడవి శేష్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 03:44 PM

అడివి శేష్ కి కథాకథనాలపై మంచి పట్టువుంది. నటుడిగాను ఆయన తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆ అయన 'మేజర్' సినిమా చేస్తున్నాడు. అలాగే 'గూఢచారి' సినిమా సీక్వెల్ ను పట్టాలెక్కించే పనులు చేయిస్తున్నాడు. అడివి శేష్ కి ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. దాంతో ఆయన దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటూ వాళ్లను విసిగిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.


ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. "కథా .. కథనాల విషయంలో నేను కూర్చుంటాను. కానీ దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటాననే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. దర్శకుల ప్రతిభాపాటవాల కారణంగానే నాకు విజయాలు దక్కాయనీ, ఈ రోజున ఈ స్థానంలో వున్నానని భావిస్తున్నాను. వాళ్ల క్రెడిట్ ను కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa