ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ పట్టించుకోకుండా మాస్టర్ వచ్చేస్తారా

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 04:27 PM

ఒకప్పుడు తెలుగులో కనీసం గుర్తింపు వస్తే చాలు అంటూ వరస సినిమాలు విడుదల చేసాడు విజయ్. కానీ కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఇక్కడ కూడా విజయం సాధిస్తున్నాయి. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో విజయం కోసం అల్లాడిపోతుంటే.. విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మాస్టర్ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అన్నీ బాగుండుంటే ఎప్రిల్ 9నే విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్ డౌన్.. కరోనా అంటూ మాస్టర్ జోరుకు బ్రేకులు పడ్డాయి. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధంలో పడిపోయింది.ఇలాంటి సమయంలో మాస్టర్ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై విజయ్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు డిజైన్ చేసారు. దాంతో పాటు మాస్టర్‌ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో మాస్టర్‌ను మీరు చూస్తారంటూ రాసుకొచ్చారు కూడా. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ క్రియేషన్స్ సినిమాను కొన్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా.. విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్‌గా నటించారు. మొత్తానికి లాక్ డౌన్ దాటుకుని కూడా మాస్టర్ బయటికి వచ్చేస్తాడేమో చూడాలిక.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa