తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయాడు. లేట్‌గానే ఎంట్రీ ఇచ్చినా కూడా లేటెస్టుగా దుమ్ము దులిపేస్తున్నాడు మెగాస్టార్. ఈయన జోరు తట్టుకోవడం కుర్ర హీరోల వల్ల కూడా కావడం లేదు. అటు సినిమాల పరంగా కానీ.. ఇటు సోషల్ మీడియాలో కానీ రప్ఫాడిస్తున్నాడు చిరంజీవి. ఇంట్లోనే ఉంటున్నాడు కదా అందుకే పాత జ్ఞాపకాలతో పాటు అన్నీ నెమరేసుకుంటున్నాడు. అలాగే తన సినిమా ముచ్చట్లను కూడా చెప్తున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఈ మధ్యే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు మెగాస్టార్.ముఖ్యంగా తనపై ట్రోల్ చేస్తున్న వాళ్లకు కూడా పంచ్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైపోయింది కదా.. మీరేమంటారు చిరంజీవి గారూ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు చిరు. అలాంటి వాళ్లను అస్సలు తాను పట్టించుకోనని.. వాళ్ల కోసం ఆలోచించి విలువైన తన సమయాన్ని పాడు చేసుకోవడం తనకు నచ్చదని చెప్పాడు చిరంజీవి.ట్రోల్ అనేది నవ్వుకునేలా ఉంటే ఓకే కానీ నవ్వుల పాలయ్యేలా మాత్రం ఉండకూడదని చెప్పాడు చిరు. తన వరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయని.. అవి చూసి తన టైమ్ వేస్ట్ చేసుకోనని చెప్పాడు మెగాస్టార్. అలాంటి వాళ్ల నీచబుద్ధి ఎప్పటికి మారదని.. వాళ్ల విజ్ఞతకే వదిలేయాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు చిరంజీవి. వాళ్ల గురించి మాట్లాడి అనవసరంగా అలాంటి వాళ్లకు విలువ ఇవ్వడం కూడా వేస్ట్ అనేసాడు చిరు. మొత్తానికి ట్రోలర్స్ చిరంజీవిని బాగానే విసిగించారని అర్థమైపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa