టాలీవుడ్ లో కామెడీ హీరో అంటే అల్లరి నరేషే. రాజేంద్రప్రసాద్,అలీ, నరేష్ వంటి సీనియర్ కామెడీ హీరోలు ప్రాభవం కోల్పోయాక, వెండితెర హాస్య ప్రియుల దాహం తీర్చిన హీరో అల్లరి నరేష్. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న ఈ వి వి సత్యనారాయణ గారి చిన్నకుమారుడైన నరేష్, నటుడు దర్శకుడు రవిబాబు డైరెక్షన్ లో 2002 లో వచ్చిన అల్లరి చిత్రంతో వెండితెరకు పరిచమయ్యారు.తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ కి మంచి క్రేజ్ వుంది. హీరోగా చాలా వేగంగా ఆయన 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ మధ్య 'మహర్షి' సినిమాలో 'అల్లరి' నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. ఆ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు.'మహర్షి' సినిమాలో చేయడం ఒక మరిచిపోలేని అనుభవం. నటన పరంగా నాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన పాత్ర అది. ఆ సినిమా షూటింగు సమయంలో మహేశ్ బాబు నన్ను 'సార్' అని పిలిచేవారు. ఆయన అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. సెట్లో అందరితోను ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు. మహేశ్ బాబును చాలా దగ్గరగా చూసే అవకాశాన్ని ఈ సినిమా నాకు కలిగించింది. నటన పరంగానే కాదు, వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే' అంటూ చెప్పుకొచ్చాడు. 'అల్లరి' నరేశ్ తాజా చిత్రంగా 'నాంది' రూపొందుతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa