ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై అవగాహనకు షార్ట్‌ ఫిలిమ్స్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 11:03 AM

కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఇఫ్లూ వర్సిటీ షార్ట్‌ ఫిలిమ్స్‌ను రూపొందించిందని వీసీ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ వీడియోలు హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషల్లో అందుబాటులో ఉన్నాయని, కరోనాపై పోరాటానికి యూనివర్సిటీ సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఫండ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa