నితిన్ ప్రధాన పాత్రలో వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. సేంద్రీయ వ్యవసాయం అంశాన్ని స్పృశిస్తూ ప్రేమ కథగా తెరకెక్కించారు వెంకీ. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై నాగ వంశీ నిర్మించారు. రష్మిక కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంస్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందించారు నితిన్. ఈ ఇద్దరి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాను నిలబెట్టేశాయి.థియేటర్స్ లో ఈ సినిమా జోరుగా సాగుతున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ చూపడం మొదలైంది. ఈ కారణంగానే చాలామంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయారు. అలాంటివారిని నెట్ ఫ్లిక్స్ ద్వారా 'భీష్మ' పలకరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వుండిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అవుతుందనే చెప్పచ్చు!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa