వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా హీరో శ్రీవిష్ణు ని చెప్పుకుంటారు. నటుడుగా వెండితెరకు పరిచయమై హీరోగా ఎదిగారు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకటే కథ వంటి చిత్రాలు నటుడిగా ఆయన్ని ఆవిష్కరించాయి. గత ఏడాది ఆయన నటించిన బ్రోచేవారెరురా సూపర్ హిట్ గా నిలిచింది.అలా ఆయన చేస్తున్న మరో విభిన్నమైన చిత్రమే 'రాజ రాజ చోళ'. పూర్తి వినోదభరితమైన ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నాకు ఎలాంటి పాత్రలు నప్పుతాయి .. ఎలాంటి పాత్రలను నా నుంచి ఆడియన్స్ ఆశిస్తారనే విషయంలో నాకు ఒక అవగాహన వుంది. అందుకు తగినట్టుగానే కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వుంటాను. కొత్త దర్శకులతో నేను వెంటనే కలిసిపోతాను. అందువలన వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వెళుతున్నాను.ఇక తెలుగు ఇండస్ట్రీలో నారా రోహిత్ నాకు ప్రాణ స్నేహితుడు. ఇన్నేళ్ల స్నేహంలో ఒక్కసారి కూడా నా మనసుకు కష్టం కలిగేలా తను ప్రవర్తించలేదు. నేను బిజీగా వుండి కాల్ చేయడం మరిచిపోతే, తను మాత్రం తప్పకుండా కాల్ చేస్తాడు. తను ఎక్కడికి వెళ్లినా మా ఫ్యామిలీ కోసం కూడా షాపింగ్ చేస్తాడు. అలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa