ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలా చేయడం వరుణ్ కి పెద్ద సాహసమే: నాగ బాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 06:35 PM

మెగా బ్రదర్ నాగబాబు తన అన్నయ్య చిరంజీవి నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ రిమేక్ చేయాలని కోరుకున్నారు. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలలో ఛాలెంజ్, కొదమ సింహం ఉన్నాయి. ఛాలెంజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన సినిమా కాగా, హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన కొదమ సింహంలో చిరంజీవి కౌబాయ్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. ఐతే ఈ రెండు చిత్రాలు వరుణ్ రిమేక్ చేస్తే చూడలని ఉంది, వరుణ్ కి పాత్రలు బాగా సెట్ అవుతాయన్నారు నాగబాబు. ఐతే చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ హిట్స్ గా ఉన్న ఆ రెండు చిత్రాలలో నటించడం, వరుణ్ కి పెద్ద సాహసమే అన్నారు.ఇక వరుణ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఆయన నెక్స్ట్ మూవీలో ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ వైజాగ్ నందు ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, అల్లు వెంకట్, సిద్ధూ ముద్ద నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తీవ్ర శిక్షణ తీసుకున్న వరుణ్, చాలా మేక్ ఓవర్ అయ్యారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa