‘కరోనా’ కట్టడి నిమిత్తం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సామాన్యుడి నుండి సెలెబ్రిటీల వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు.లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ అందాల నటి సన్నీలియోన్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. సన్నీలియోన్ భర్త డానియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తోంది. సన్నీలియోన్ తన కూతురు నిషాతో కలిసి గులాబీ పూలతో డిజైన్ చేసిన కిరీటాన్నిపెట్టుకుంది.‘ నిషా చాలా చాలా అందంగా ఉంది. నేను చాలా లక్కీ మమ్మీని..’ అనే క్యాప్షన్ తో కెమెరా కు ఫోజులిస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సన్నీ, నిషా ఇద్దరూ తెలుపు రంగు టీషర్ట్ తో సందడి చేశారు.