ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ సినిమా లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 28, 2020, 10:55 AM

వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతుండగా బాక్సర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా వైజాగ్ వేదికగా ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. సిద్దు ముద్దా, అల్లు వెంకట్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనితో ఈ సినిమాలో ఉపేంద్ర రోల్ ఏమై ఉంటుందని ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేగుతుంది. ఐతే ఆయన రోల్ వరుణ్ కి బాక్సింగ్ కోచ్ మరియు గురువుగా ఉండే అవకాశం కలదని టాలీవుడ్ టాక్. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa