మహేశ్ బాబు హీరోగా కైరా అద్వాని జీరోయిన్ గా వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో వీరిరువురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అభిమానులు అనుకున్నారు. ఈ కారణంగానే మహేశ్ బాబుతో తాను చేయనున్న సినిమా కోసం పరశురామ్ ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు.అయితే ప్రస్తుతం తన చేతిలో నాలుగు బాలీవుడ్ సినిమాలు వున్నాయనీ, వాటిని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టానని అందట. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి రెండేళ్లు పడుతుందనీ, ఈ లోగా మరో సినిమాను కమిట్ కాలేనని చెప్పిందట. దాంతో పరశురామ్ మరో కథానాయిక కోసం వెతుకులాట మొదలుపెట్టినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa