ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమాలో రజని – ఖుష్బూ పై ఓ సాంగ్ కూడా ఉంటుందట...!

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 11:22 AM

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి చిత్రాలు చేశారు. రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో మాజీ బ్యూటీ మీనా కూడా రజిని సరసన న‌టిస్తోన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన ఖుష్బూని హీరోయిన్ గా తీసుకున్నారు. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి. రజని – ఖుష్బూ పై ఓ సాంగ్ కూడా ఉంటుందట. ఇక రజనీ గత చిత్రాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టనున్నారు అన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa