టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమాని అంటే మొదట గుర్తుకు వచ్చే లిస్ట్ లో నితిన్ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి నితిన్ పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే. తనకంటూ ఒక మార్కెట్, స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత కూడా నితిన్ ఏ మాత్రం తగ్గకుండా ఒక సాధారణ అభిమానిలా తన ప్రేమను చాటుకుంటాడు.అలాంటి నితిన్ తన కారణంగా పవన్ కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.గతంలో తన బ్యానర్లో నితిన్ 'ఛల్ మోహన్ రంగా' సినిమా చేశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన నష్టాలు వచ్చాయి. అయితే తన కారణంగా పవన్ కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలని నితిన్ భావించినట్టుగా సమాచారం. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమాకి పవన్ బ్యానర్ పేరును వాడుకుని, సహ నిర్మాతగా లాభాల్లో ఆయనకి వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు పవన్ అంగీకరిస్తాడా? లేదా? అనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa