ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమెడియన్‌ పై సంచనల కామెంట్స్ చేసిన నటి ప్రగతి..

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 04:37 PM

టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది ఫీమేల్ కారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ తల్లిగా.. వదినగా చాలా సినిమాలు చేసింది ఈమె. అప్పట్లో చిరుత సినిమాలో రామ్ చరణ్ తల్లిగా కూడా ఈమె నటించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది.. తనకంటే చాలా పెద్ద హీరోలకు కూడా అమ్మగా నటించింది ప్రగతి. వందలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ కమెడియన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి ప్రగతి తన కెరియర్లో తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు."ఒక స్టార్ కమెడియన్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు చేశాను. ఒక సినిమా షూటింగులో మాత్రం ఆయన మాటలు .. చేష్టలు కాస్త తేడాగా అనిపించాయి. ఆయన ధోరణి నాకు చాలా బాధను కలిగించింది. దాంతో విరామ సమయంలో కారవాన్ లో ఆయనను కలిశాను. ఆయన పద్ధతి బాగోలేదనీ, ఆయన ప్రవర్తన కారణంగా తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని గట్టిగానే చెప్పాను. అప్పుడు ఆయన మౌనంగానే వుండిపోయాడు. ఆ తరువాత మాత్రం నాకు చాలా పొగరు ఎక్కువని ప్రచారం చేశాడు" అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa